సెప్టెంబరు 20 నుంచి ‘సచివాలయ’ పరీక్షలు

సెప్టెంబరు 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ గారు అన్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అధికారులతో సమీక్షించారు. వారం రోజుల పాటు పరీక్షలను నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ గారు తెలిపారు. దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెల్లడించారు. ఖాళీలు ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని మంత్రులు అధికారులకు సూచించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *