సమస్యాత్మక నేలల్లో యాజమాన్య చర్యలు !

సమస్యాత్మక నెేలలైన తెల్ల/ నల్ల చౌడు
నేలలు, సల్ఫైడ్ నేలలు వలన మొక్కలు ఎదుగుదల లోపించి పంట దిగుమతి పై ప్రభావం చూపిస్తాయి. సరైన యాజమాన్య పద్దతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు చౌడు నేలలు నీటిలోని లవణాల ద్వారా తెల్ల చౌడు, భూమిలోని లవణముల వల్ల నల్ల చౌడు నేలలు ఏర్పడతాయి.

  • చౌడును తట్టుకొను పంటలను, వంగడాలను ఎంచుకోవాలి.
  • ముదిరిన నారును, 3-4 మొక్కలను దూరము తగ్గించి కొంచెం లోతుగా నాటుకోవాలి.
  • పొలంలో నీరు నిల్వ ఉంచుతూ, తీసివేస్తూ క్రొత్త నీరు పెట్టడం వలన నీటి యాజమాన్య చర్యలు చేపట్టాలి.
  • ఆమ్ల రసాయన ఎరువులైన యూరియా, సింగిల్ సూపర్ ఫాస్పేట్ మొదలైన ఎరువులను ఉపయోగించాలి.

భాస్వరం, సూక్ష్మపోషకాల లోపాలను సవరించాలి – చౌడు నేలల్లో భాస్వరం, జింక్, ఇనుప ధాతు లోపం కనిపిస్తుంది. కాబట్టి చౌడు నేలల్లో 25% భాస్వరం అధికంగా చల్లుకోవాలి. జింకు ధాతు లోపం సవరణకు ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ ను చివరి దుక్కిలో వేయాలి (లేదా) లీటరు నీటికి 2 గ్రా, జింకు సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2,3 సార్లు పిచికారి చేయాలి. ఇనుప ధాతు లోపం సవరణకు లీటరు నీటికి 10 గ్రా. అన్నభేరి, 2 గ్రా. నిమ్మఉప్పు కలిపి పిచికారి చేయాలి (లేదా) 12% ఇ.డి.టి.ఏ ఫెర్రస్ లీటరు నీటికి 1-1.5 గ్రా. చొప్పున పిచికారి చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని వాడాలి.శాశ్వత చౌడు నివారణకు గాను రైతులు ఎప్పటికప్పుడు పచ్చిరొట్ట పైర్లను సాగుచేయడం, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం మరియు భూసార పరిక్షననుసరించి జిప్సం వంటి రసాయనాలను భూమిలో వేసి బాగా నీరుపెట్టి కలియదున్నాలి. నీటిని తీసివేయడము వలన పొలంలో లవణాల సాంద్రతను తగ్గించి చౌడును నివారించుకునే అవకాశం ఉన్నది. సల్ఫైడ్ నేలలు గంధకం అధికము గా ఉండే నేలల్లో “సల్ఫైడు దుష్ఫ్రభావం” సంభవిస్తుంది. ఇటువంటి ప్రాంతములో, నేల బాగా మెత్తగా ఉండి,పొలంలో నడుస్తుంటే బుడగలు వస్తాయి. నేల నుండి క్రుళ్లిన కోడి గుడ్ల వాసన మరియు మొక్కను వేర్లతో బయటకు తీసినప్పుడు పూర్తిగ నల్లబడి, కుళ్ళిన వాసన వస్తుంది.మొక్క వేర్లకు తగిన గాలి తగిలే విధంగా, నీటిని తీసి మళ్ళీ నీరు అందివ్వాలి.పంటకు మడిని తయారు చేయుటకు ముందు మట్టిని ఆరబెట్టడం, పొలాల్ని సన్న నెఱ్ఱెలు వచ్చేవరకు ఆరగట్టి అప్పుడప్పుడు మళ్ళీ నీరివ్వడం వంటి చర్యలతో క్రమంగా సల్ఫైటు దుష్ప్రభావం తగ్గుతుంది.ఇటువంటి నేలల్లో సేంద్రియ ఎరువులు మరియు సల్ఫరు (గంధకము) కలిగిన 20-20-0-13 లాంటి కాంప్లెక్సులను, అమ్మోనియం సల్పేట్ వంటి ఎరువులను వాడరాదు.జి. రాజ్యలక్ష్మీ మండల వ్యవసాయాధికారి, తిరువూరు మండలం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *