వైర‌‌స్ టెస్టింగ్, అంబులెన్స్ కోసం మంత్రి కేటీఆర్‌కు రూ.20,50,000 ల చెక్కు అందజేత

హైద‌రాబాద్: క‌రోనా క‌ట్ట‌డి కోసం మంత్రి కేటీఆర్ గ‌త నెల‌లో త‌న పుట్టినరోజు సందర్భంగా.. తనవంతుగా ప్రభుత్వాస్పత్రులకు ఆరు అంబులెన్సులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే కరోనా వైరస్ టెస్టింగ్ కోసం, ఇతర అవసరాల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. KTR నిర్ణయాన్ని స్వాగతిస్తూ ములుగు జిల్లా T.R.S.నాయకులు కాకుల మర్రి లక్ష్మీ నరసింహారావు(లక్ష్మణ్ బాబు) ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని.. వైర‌స్ నియంత్ర‌ణ‌కై త‌న‌వంతుగా‌ రూ.20,50,000 వేల చెక్కును అందజేశారు.
బుధ‌వారం పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలుసుకున్నారు. అనంత‌రం ములుగు జిల్లా లోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కరోనా వైరస్ టెస్టింగ్ మరియు ఇతర అవసరాల కోసం, అంబులెన్స్ కోసం ఇర‌వై లక్షల యాభై వేల రూపాయల చెక్కును కేటీఆర్ కు అంద‌జేశారు.జోసెఫ్ కుమార్ ప్రజానేత్ర రిపోర్టర్ భద్రచలం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *