రహదారుల నిర్మాణం చేపట్టాలి ; వసంత కృష్ణ ప్రసాద్

పదికాలాల పాటు పదిలంగా ప్రజలకు ఉపయోగపడేలా రహదారుల నిర్మాణం చేపట్టాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు అధికారులు కాంట్రాక్టర్ల కు సూచించారు.రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం – పేరువంచ రహదారి ని రూ 31 కోట్ల వ్యయంతో డబల్ లైన్ రోడ్డు గా విస్తరణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు.స్థానిక నాయకులతో కలసి ముందుగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారు అధికారులతో కలసి పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అబివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులు బాధ్యతగా పనులు చేయించాలని కోరారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు గారు మండల పార్టీ అధ్యక్షలు పాలంకీ మురళి మోహనరెడ్డి గారు, జడ్పీటిసీ అభ్యర్ది పాలంకీ విజయబాస్కరరెడ్డి గారు స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *