మూడు రాజ‌ధానుల బిల్లు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొంద‌డాన్ని హ‌ర్షిస్తూ చిల‌క‌లూరిపేట‌లో ర్యాలీ

ప‌రిపాల‌న వికేంద్రీక‌రణే ప్రాంతీయ అస‌మాన‌త‌ల‌కు మందు
రాష్ట్ర చ‌రిత్ర‌లోనే సువ‌ర్ణ అధ్యాయం ఈ రోజే మొద‌లైంది
చిల‌కలూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు
మూడు రాజ‌ధానుల బిల్లు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొంద‌డాన్ని హ‌ర్షిస్తూ చిల‌క‌లూరిపేట‌లో ర్యాలీ
ప‌రిపాల‌న‌ను అన్ని ప్రాంతాల‌కు వికేంద్రీక‌రించ‌గ‌లిగితే ప్రాంతీయ అస‌మాన‌త‌ల ఊసే ఉండ‌ద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. మూడు రాజ‌ధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో చిల‌క‌లూరిపేట‌లో శ‌నివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని హ‌ర్షిస్తూ ర్యాలీ నిర్వ‌హించారు. న‌ర‌స‌రావుపేట సెంట‌ర్ నుంచి మూడు థియేట‌ర్ల సెంట‌ర్ వ‌ర‌కు ర్యాలీ కొన‌సాగింది. అనంత‌రం అక్క‌డే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు, సోమేప‌ల్లి సాంబ‌య్య గార్ల విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేశారు. స్థానిక శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నారా చంద్ర‌బాబునాయుడు అమ‌రావ‌తి పేరుతో గ్రాఫిక్స్ మాయాజాలం చేసారని, త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారు అలా కాద‌ని, అన్ని ప్రాంతాలు స‌మానస్థాయిలో అభివృద్ధి చెందేలా చూడ‌ట‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. మొద‌టి నుంచి అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని తాము ఆకాంక్షిస్తూనే ఉన్నామ‌ని చెప్పారు. ప‌రిపాల‌నను వికేంద్రీక‌రించిన‌ప్పుడే అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ కూడా సాధ్య‌మ‌వుతుంద‌ని తెలిపారు. ఇదే ల‌క్ష్యంతో త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌ద‌న్నారు. ఇక‌పై ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు స‌మాన స్థాయిలో అభివృద్ధి చెందుతాయ‌న్నారు. గుంటూరు జిల్లాలో శాస‌న రాజ‌ధాని ఉండ‌టం జిల్లా వాసులుగా మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చెప్పారు. అన్ని ప్రాంతాల‌ను స‌మాన‌దృష్టితో చూడ‌గ‌లిగిన‌ప్పుడే ప్రాంతాల మ‌ధ్య విద్వేషాలు లేకుండా ఉంటాయ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అంద‌రూ స్వాగ‌తించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లంతా సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు వెన్నంటి ఉన్నార‌ని తెలిపారు. రాష్ట్రానికి ఈ రోజు ఎంతో ప్ర‌త్యేక‌మైన రోజ‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో ప‌ట్ట‌ణ మార్కెట్ యార్డు చైర్మ‌న్ బొల్లెద్దు చిన్న‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ‌, నాదెండ్ల‌, చిల‌క‌లూరిపేట‌, య‌డ్ల‌పాడు మండ‌లాల అధ్య‌క్షులు ప‌ఠాన్ త‌ల్హాఖాన్‌, శ్రీనివాస‌రెడ్డి, దేవినేని శంక‌ర‌రావు, క‌ల్లూరి బుజ్జి,పార్టీ అధికార ప్రతినిధి షేక్ దరియా వలి,పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,యస్.సి సెల్ అధ్యక్షుడు బండారు వీరయ్య, యస్.టి సెల్ అధ్యక్షుడు బాలకోటి నాయక్,బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరాంజనేయులు, పార్టీ నాయ‌కులు మాదం శ్రీనివాసరావు, కాట్రగడ్డ మస్తాన్ రావు,కొలిశెట్టి శ్రీనివాసరావు,యం.వి రత్నారెడ్డి, నకరికంటి శ్రీకాంత్,దాసరి మర్థు,కె. బాబీ మరియు పలువురు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *