మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి

మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారని ఇటువంటి నాయకుడు పాలనలో మనం ఉండటం మన అదృష్టమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు అన్నారు. మైలవరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు నాయకులతో కలిసి జగనన్న చేయూత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు .ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ.మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రభుత్వ పధకాన్ని పార్టీల రహితంగా అర్హత ఉన్న పేదలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని పధకాలను అమలు చేస్తున్న నాయకులు మన ముఖ్యమంత్రి జగనన్న అని కొనియాడారు. అనంతరం జగనన్న చేయూత పధకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మైలవరం మార్కెట్ కమిటీ చైర్మన్ పామర్తీ శ్రీనివాసరావు, మండల పరిషత్ అధికారులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *