భారతీయ స్టేట్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ ను వెంటనే నియమించాలనికోరుతూ నిరసన

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కుానేరు భారతీయ స్టేట్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ వెంటనే నియమించాలనికోరుతూ నిరసన. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంకు వద్ద ఫీల్డ్ ఆఫీసర్ను వెంటనే నియమించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యాన. బుధవారం భారతీయ స్టేట్ బ్యాంకు వద్ద నిరసన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కుానేరు స్టేట్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గడిచిన 12 నెలలుగా లేకపోవడంతో రైతులకు క్రొత్త క్రాప్ లోన్లు ఇవ్వడంగాని అలాగే పూర్తి స్థాయిలో రెన్యువల్ చేయించుకోవడం గానీ జరిగే పరిస్థితి లేదు. ఫీల్డ్ ఆఫీసర్ లేకపోవడం వల్ల కొమరాడ మండల పరిధిలో 52 గ్రామాల రైతులకు ఈ ఏడాది కొత్త రుణాలు లేక చాలా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్న పరిస్థితి కూనేరు స్టేట్ బ్యాంకు వద్ద ఫీల్డ్ ఆఫీసర్ లేకపోవడంతో ఈ ఏడాది పూర్తిగా లేకుండా పోయింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి నిరసన కార్యక్రమం ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతే రాజు అని రైతు ఈ దేశానికి వెన్నెముక అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన ప్రజాప్రతినిధులకు కొమరాడ మండలంలొ కూనేరు స్టేట్ బ్యాంకు గుర్తుకు రాదా అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే కూనేరు స్టేట్ బ్యాంకులో గడిచిన 12 నెలలుగా ఫీల్డ్ ఆఫీసర్ లేకపోవడంతో కొమరాడ మండలంలో నయా కుంతేసు మసి మండల పూడేసు పెద్ద శాఖ ఉలిపిరి సిళ్ల పదం దేవుకోన కొమరాడ గుణదతీలేసు కెమిశీల పాలెం పంచాయతీలకు సంబంధించిన 52 గ్రామాల రైతులకు ఈ ఏడాది క్రాప్ లోన్ లేక చాలా తీవ్రంగా నష్టపోయారని దీనివల్ల పొలం మదుపుల కోసం అధిక వడ్డీకి డబ్బులు తెచ్చుకుని బాగా నష్టపోయారని ఇంత జరిగినా కనీసం అధికారులు స్టేట్ బ్యాంకులో 12 నెలగా ఫీల్డ్ ఆఫీసర్ ని నియమించకపోవడం చాలా అన్యాయమని కావున వెంటనే కుారునే స్టేట్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని నియమించి రైతులందరికీ క్రాప్లోన్ నిచ్చి రెన్యువల్ చేసి ఆదుకోవాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పకీరు రాములు పాల్గొన్నారు. కూనేరు స్టేట్ బ్యాంకు వద్ద నిరసన తెలియజేస్తున్న ఫొటోలు చూడగలరు. రిపోర్టర్ సామ్ ఆర్థం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *