పోలీస్ సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అన్ని వేళలా కృషి చేస్తాం : ఎస్పి సునీల్ దత్ ఐపీఎస్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రపురం నందు పోలీస్ సిబ్బందికి అవసరమైన పలు సంక్షేమ కార్యక్రమాలను జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీ గారికి పోలీసు అధికారులందరూ ఘనంగా స్వాగతం పలికారు.ముందుగా జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ యొక్క ప్రధాన ద్వారాన్ని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ప్రారంభించారు.అనంతరం గార్డ్ రూమ్,మహిళా సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని మరియు పోలీసు అధికారులు,సిబ్బంది కోసం పునర్నిమించిన వసతి సౌకర్యాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం విధులలో నిమగ్నమై ఉంటున్నా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సంక్షేమం కొరకు మరియు వారికి కావలసిన అన్ని రకాల వస్తువులను ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఎల్లవేళలా ముందుంటామని అన్నారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లో సిబ్బంది సంక్షేమం కోసం ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.కిష్టయ్య గారి ఆధ్వర్యంలో కృషి చేస్తున్న అధికారులందరిని సందర్భంగా అభినందించారు. అదేవిధంగా ఓఎస్డీ కార్యాలయంలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన వ్యాయామశాలను కూడా ప్రారంభించారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ వి.తిరుపతి,అడిషనల్ ఎస్పీ ఏ.రమణారెడ్డి, ఏఎస్పీ వినీత్ ఐపీఎస్,ఎసిబి ఇన్స్పెక్టర్ రవి,ఆర్ఐలు సీఎహెచ్.ఎస్.వి.కృష్ణ,ప్రసాద్,సోములు,కామరాజు,దామోదర్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గోన్నారు. జోసెఫ్ కుమార్ ప్రజానేత్ర రిపోర్టర్ భద్రచలం

Add a Comment

Your email address will not be published. Required fields are marked *