త్యాగానికి ప్రతీక బక్రీద్ – సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా

కొండపల్లి మున్సిపాలిటీ మరియు ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ఈద్ నమాజ్ నిర్వహించారు.బక్రీద్ పండుగ సందర్భముగా కొండపల్లి సయ్యద్ షాబుఖారి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం సూఫీ మత గురువులు మరియు హజరత్ సయ్యద్ షాబుఖారి ఆస్థాన పీఠాధిపతులు మహమ్మద్ అల్తాఫ్ బాబా మాట్లాడుతూ హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి త్యాగం మరువ లేనిదని, కేవలం కలలో అల్లాహ్ తెలిపిన ప్రకారం తన కుమారుడిని బలి ఇవ్వటానికి సిద్ధమయ్యారంటే, అల్లాహ్ అంగీకారానికి ఏ విధంగా శిరసావహించారో తెలుస్తుందని, బక్రీద్ అంటే కేవలం జంతువుని బాలి ఇవ్వటం కాదని మనిషి సన్మార్గంలో నడిచేటప్పుడు అల్లాహ్ మెప్పు పొందాలంటే అన్ని త్యాగాలకు సిద్ధమవ్వాలని తెలియజేసారు.కరోనా మహమ్మారి నుండి అల్లాహ్ అందరిని కాపాడాలని, ప్రపంచంలో శాంతి నెల కొల్పాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *