కంభంలో ఆరు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్

ప్రకాశం జిల్లా కంభం లో ఈనెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని కంభం ఎస్సై మాధవరావు వెల్లడించారు…అలానే ప్రజలు ఎవరు ఆ ఆరు రోజుల పాటు ఇళ్ల నుండి బయటకు రాకుండా ఇంటికే పరిమితం కావాలని అత్యంత అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు…అలానే 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుంది కాబట్టి ప్రజలు వారికి కావాల్సిన నిత్యావసరాలు రేపు బుధవారం అంటే 12వ తేదీన నిత్యావసరాలను వారికి కావాల్సినవి ముందుగానే కొనుగోలు చేసుకొని ఉంచుకోవాలని. 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎటువంటి దుకాణాలు కానీ వ్యాపార సముదాయాల కానీ అనుమతి లేదని పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని. అలానే మార్కాపురం అర్ధవీడు గిద్దలూరు బేస్తవారిపేట ప్రజలు ఎవ్వరు కూడా కంభం కు వచ్చే ప్రయత్నం చేయవద్దని అలానే కంభం ప్రజలు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని అలా కాదని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఇళ్ల నుంచి బయటకు వస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కంభం ఎస్సై మాధవరావు హెచ్చరించారు…ప్రజానేత్ర ఆంద్రప్రదేశ్, కోమరోలు మండలం, రూరల్ రిపోటర్, బి.శివమణి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *