ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15న నిర్వహించాలనుకున్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అక్టోబర్‌ 2న ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని భావిస్తోంది. తొలుత ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది రోజున చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అనంతరం జులై 8న వైఎస్‌ జయంతి సందర్భంగా ఇవ్వాలని యోచించింది. ఇళ్ల సేకరణ ఆలస్యంతో ఆగస్టు 15కు వాయిదా వేసింది. ప్రస్తుతం కోర్టులో దీనిపై విచారణ జరుగుతుండటంతో మరోసారి ఈ కార్యక్రమం వాయిదా పడింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *