ఎరిచర్ల కిరణ్ మృతి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ ; గొట్టిముక్కల సుజాత నిరాహారదీక్ష

ఎర్రగొండపాలెం లో దళిత బహుజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత తన నివాసంలో 31-07-2020 నుండి 02-08-2020 వరకు మూడు రోజులపాటు చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమంలో ఈరోజు రెండవ రోజు నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతున్నది ఈ నిరాహార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం చీరాలలో దళితుడైన ఎరీచర్ల కిరణ్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని,కిరణ్ మృతికి కారణమైన పోలీస్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని,కిరణ్ మిత్రుడైన షైనీ అబ్రహం పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి జైలు నుండి విడుదల చేయాలని,కిరణ్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయలు ఆర్థికసాయం అందించాలని,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని,గృహాన్ని నిర్మించి ఇవ్వాలని డిమాండ్లతో నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగినది. ప్రజానేత్ర రిపోర్టర్:🎤రమణరెడ్డిచిలకల ఎర్రగొండపాలెం నియోజకవర్గం,ప్రకాశం జిల్లా,ఆంధ్రప్రదేశ్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *