ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర ప్రచార సహాయ కార్యదర్శిగా ఇరుగుల రాజశేఖర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర ప్రచార సహాయ కార్యదర్శి గా కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం మునగపాడు గ్రామానికి చెందిన ఇరుగుల రాజశేఖర్ రెడ్డిని నియమించారు. ఈమేరకు నియామక ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి లు జారీ చేశారు. ఇరుగుల రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, క్రమశిక్షణతో ముందుకు వెళ్లి ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి సంఘాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని వారు ఆకాంక్షించారు. కాగా ఇప్పటికే ఇరుగుల రాజశేఖర్ రెడ్డి కోస్తాంధ్ర కోఆర్డినేటర్ గా ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి సంఘం నుంచి విస్తృతంగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా జి.కొండూరు లో మీడియాతో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. రెడ్డి కులంలో కూడా ఎంత మంది పేదలు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరుపున ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో ఏదైనాసరే అన్యాయం తక్షణమే స్పందించి వారికి అండగా నిలబడతామని పేర్కొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *