అభివృద్ధిలో వ్యత్యాసాలు లేకుండా మూడు రాజధానులు – రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు

రేపల్లె రాష్ట్రంలో అభివృద్ధి పరంగా వ్యత్యాసాలు లేకుండా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుగా విభజించి అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి ధేయంగా పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. శనివారం ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ, కర్నూలు, అమరావతి ప్రాంతాలలో మూడు రాజధానులుగా విస్తరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అమరావతి ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడంలేదని అమరావతి కూడా రాజధానిగా ఉంటుందని వెల్లడించారు. అమరావతి ప్రజలకు చంద్రబాబు ఊహల్లో సింగపూర్ నిర్మిస్తానని వారిని మోసం చేశారని తెలిపారు.రేపల్లె శ్రీకాంత్ ప్రజానేత్ర.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *